సిద్ధం సభను జయప్రదం చేయండి : పెద్దిరెడ్డి

ప్రజాశక్తి – కడప ఈ నెల 27వ తేదీన ప్రొద్దుటూరులో నిర్వహించే సిద్ధం సభను జయప్రదం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధ వారం స్థానిక ఆదిత్య కల్యాణ మండపంలో నిర్వహించిన సమన్వయ సమా వేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు పెద్దిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. సిద్ధం సభకు సంబంధించి పోస్టర్లను మంత్రి పెద్దిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వైసిపి జిల్లా అధ్యక్షులు సురేష్‌ బాబు, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సిఎం వైఎస్‌ జగన్‌ 27 నుండి మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తారన్నారు. గతంలో నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు జరిగాయన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి టూర్‌ కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురాం పాల్గొన్నారు.

➡️