సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: పేదవారికి సీఎం సహాయనిధి ఆపదలో అండగా నిలుస్తోందని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసిపి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. గురువారం స్థానిక కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. జవహర్‌ కాలనీకి చెందిన కలగాట్ల శ్రీనివాసరెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్షా అరవై వేల విలువైన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ఆపద సమయాల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్లు గుంటక సుబ్బారెడ్డి, గొలమారి శ్రీనివాసరెడ్డి, 35వ వార్డు ఇన్‌ఛార్జి గుంటక చెన్నారెడ్డి, వైసిపి నాయకులు బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️