హామీలు అమలు చేయకపోతే సమ్మె ఉధృతం

సత్తెనపల్లిలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద శిబిరంలో మాట్లాడుతున్న కె. ఉమామహేశ్వరరావు

సత్తెనపల్లి: పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమా మహే శ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత రెండు రోజులుగా మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె బుధవారానికి రెండో రోజు చేరుకుంది. స్థానిక మున్సిపల్‌ కార్యా లయం ముందు ఏర్పాటు చేసిన సమస్య శిబిరాన్ని ఆయన సందర్శించి వారి పోరా టానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. శిబి రాన్ని సిపిఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ కార్మికులను వారి నైపుణ్యాల మేరకు వేతనాలు ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు కూడా పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా హెల్త్‌,రిస్క్‌ అలవెన్స్‌ అందించాలని తదితర డిమాండ్ల చేస్తున్న సమస్య పరిష్కారం అయ్యేవరకు కొన సాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లిపల్లి ముత్యాల రావు, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌,అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి జి.మల్లేశ్వరి, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, డివైఎఫ్‌ఐ నాయ కులు జడ రాజ్‌ కుమార్‌ తదితర నాయకులు ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి మున్సిపల్‌ కార్మికులకు తమ మద్దతు తెలిపారు. భవిష్యత్తులో కొనసాగబోయే సమ్మెకు తమ సహాయ సహకారాలు కచ్చితంగా అందిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు. రెండవ రోజు సమ్మె శిబిరంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం హరిపోతురాజు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు మామిడి జగన్నాధ రావు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు వంగిపరపు చంద్రకళ ,మున్సిపల్‌ యూనియన్‌ సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు చింతగుంట్ల చిన్న వెంకయ్య ,మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మాచర్ల్ల : నిరవధిక సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన రిలే దీక్షల శిబిరాన్ని సిఐటియు నాయకులు బండ్ల మహేష్‌ ప్రారంభించారు. మహేష్‌ మాట్లాడుతూ సమ్మె వలన ప్రజలకు కలిగే అసౌకర్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కె రమణ, అనసూయ, బత్తుల చిన్నమ్మాయి, లక్ష్మీదేవి, దేవళ్ళ రమణ, ఇసాకు, ఆంజమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

దాచేపల్లి: దాచేపల్లి మునిసిపల్‌ కార్మికులు మోకాళ్ళ దండ వేసి నిరసన తెలిపారు . స్థానిక లైబ్రరీ సెంటర్‌ వద్ద టెంట్‌ వేసి కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తాము ఇచ్చిన హామీలు నిరవేర్చాలని అప్పటి వరకు సమ్మె కొన సాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. మునిసిపల్‌ కార్మికుల సంఘం కార్యదర్శి శామ్యూల్‌, కార్మికులు ఏబు, వెంకటేష్‌ , గోపి పాల్గొన్నారు.

పిడుగురాళ్ల: స్థానిక ఐలాండ్‌ సెంటర్‌లో పారిశుద్ధ కార్మికులు సమ్మె శిబిరంలో మోకాలుపై నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు సమ్మె శిబి రాన్ని సందర్శించి మాట్లాడుతూ కేం ద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు నష్టం చేసే మూడు చట్టాలు తీసుకొస్తే వాటిని రద్దు చేసే వరకు రైతులు పోరా డారని గుర్తుచేశారు. అదేవిధంగా కార్మి కులు, రైతులను ఆదర్శంగా తీసుకొని విజయం సాధించే వరకు పోరాడాలని. పిలుపు నిచ్చారు. న్యాయమైన డిమాం డ్లను వెంటనే పరిష్కరించకపోతే దశల వారిగా ఆందోళన చేపడతామని ప్రభు త్వాన్ని హెచ్చ రించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు తెలకపల్లి శ్రీనివాస రావు పారి శుధ్య కార్మికులు కె.సీతా రామయ్య, ప్రతాపు, కొండలు, సుజాత, అనంతలక్ష్మి, మరియమ్మ, మార్తమ్మ, గుర వయ్య, నాగయ్య, సురేంద్ర పాల్గొన్నారు.

➡️