హైమా హాస్పిటల్లో యూరాలజీ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌

ప్రజాశక్తి-చీరాల: కార్పొరేట్‌ వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న హైమా హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ హైమా సుబ్బారావు సేవలు అభినందనీయమని అన్నారు. ఆదివారం హైమా హాస్పిటల్‌లో డాక్టర్‌ గుంటుపల్లి సుబ్బారావు నూతనంగా ఏర్పాటు యూరాలజీ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌లను తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, చీరాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైమా హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో యూరాలజీ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ సేవలు ఏర్పాటు చెయ్యటం అభినందనీయమని అన్నారు. ప్రజలకు మరింతగా సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గోరంట్ల సుబ్బారావు, అర్బన్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గవిని శ్రీనివాసరావు, చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, దివి జయరావు, గోలి నాగరాజు, గుంటూరు వెంకట సుబ్బారావు, పృథ్వీ ధనంజయ, అందే సుబ్బారాయుడు, చప్పిడి రామచంద్రరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️