10న ‘సిద్ధం’కు సన్నద్ధం కావాలి: మంత్రి అంబటి

సత్తెనపల్లి మండలంలో బులెట్‌ పై పర్యటిస్తున్న మంత్రి అంబటి రాంబాబు

సత్తెనపల్లి రూరల్‌: సిద్ధం మహాసభకు వైసిపి శ్రేణులు సన్నద్ధం కావాలని మంత్రి అంబటి రాంబాబు పిలుపిచ్చారు.సత్తెనపల్లి మండలంలోని నందిగామ, గుడిపూడి,లక్ష్మీపురం, ఫణిదం, భట్లూరు, కట్టమూరు, డిడిపాలెం, అబ్బూరు తదితర గ్రామాల్లో మంత్రి అంబటి రాంబాబు బులెట్‌ పై గురువారం పర్యటించారు. ద్విచక్రవాహనాల భారీ ర్యాలీతో అంబటి పర్యటించారు. మిర్చి కూలీలతో మమేకమయ్యారు. స్థానిక నేతలతో సమావేశ మయ్యారు . జగన్మోహన్‌ రెడ్డి పాలన గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. మార్చి 10న మేదరమెట్ల లో జరిగే సిద్ధం సభకు జనాన్ని సమీకరించాలని విజ్ఞప్తి చేశారు.

➡️