Doctorate – 10టీవీ బ్యూరో చీఫ్‌ జార్జికి జర్నలిజంలో డాక్టరేట్‌ ప్రదానం

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ (విశాఖ) : ఆంధ్రా యూనివర్శిటీ జర్నలిజం విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి, 10 టీవీ బ్యూరో చీఫ్‌ భూపతి జార్జి ఫెర్నాండేజ్‌ కు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ డాక్టరేట్‌ ను ప్రదానం చేసింది. ప్రొఫెసర్‌ చల్లా రామకృష్ణ పర్యవేక్షణలో సమాచార హక్కు చట్టం – పత్రికల పాత్ర – మీడియా ప్రచురించిన కథనాలు అనే అంశంపై జార్జి ఫెర్నాండేజ్‌ పరిశోధనలు చేశారు. జార్జి చేసిన పరిశోథన ఫలితాలను పరిశీలించి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ప్రొఫెసర్‌ చల్లా రామకృష్ణ చేతుల మీదుగా బుధవారం జార్జికి డాక్టరేట్‌ ను అందచేశారు. అనంతరం జర్నలిజంలో డాక్టరేట్‌ అందుకున్న జార్జ్‌ ను ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ శశిభూషణరావు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.

➡️