రంపచోడవరం ఐటిడిఎ పిఒ సింహాచలం
ప్రజాశక్తి -రంపచోడవరం: ఉపాధి జాబ్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజులు పనులు కల్పించాలని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఐటిడిఎ సమావేశమందిరంలో ఉపాధి హామీ పథకం ఎపిడితో, పిఎఒలు, ఎపిఒలతోసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా పనుల గుర్తింపునకు గ్రామసభలు తీర్మానాలతో నివేదికల సమర్పించాలన్నారు. మండలాల వారిగా పనులపై ఆరా తీశారు. ఉపాధి పనులు వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. .కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడి జి.శ్రీనివాసరావు,పిఏఓ యల్.రాంబాబు, ఉపాధి హామీ పథకం ఏపీవోలు సత్యనారాయణ, సాయిబాబా ప్రకాష్, సురేష్, స్వామి, రెడ్డి బాబు, మణి కుమారి, అరవాలు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
రంపచోడవరం : ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఆదేశించారు. బుధవారం ఐటిడిఎ సమావేశమందిరంలో ఎటిడబ్ల్యుఒలు, హెచ్‌ఎంలు, గురుకులాల ప్రిన్సిపల్స్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పిఒ మాట్లాడుతూ. ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయాలని, విద్యార్థులకు అనారోగ్యంగా ఉంటే వెంటనే ఆస్పత్రులు జాయిన్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆశ్రమ పాఠశాలల లోపలికి ఇతరులను అనుమతించరాదని సూచించారు. గిరిజన సంక్షేమ పాఠశాలలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఐ. కొండలరావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలలో ప్రతి నెల మూడో శనివారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే విధంగా ఒక గ్రూపు ఏర్పాటు చేస్తామన్నారు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎటిడబ్ల్యుఒలు రామ తులసి, కృష్ణమోహన్, సూపరింటెండెంట్ బి. కిషోర్,హెచ్‌ఎంలు బి ఎస్ కుమార్, బి. నాగేశ్వరరావు, రామారావు, సీనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, చక్రధర్,పి. భీమిరెడ్డి,నాగేంద్ర, పాల్గొన్నారు.
మాట్లాడుతున్న పిఒ సింహాచలం