భూముల పరిశీలన వంద శాతం పూర్తి చేయాలి

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో ఇంకను మిగిలి ఉన్న ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల పరిశీ లనను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి తహశీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ పరిశీలన, అసైన్మెంట్‌ భూముల ఫ్రీహోల్డ్‌ పరి శీలన, రెవెన్యూ శాఖకు సంబంధించి పిజిఆర్‌ఎస్‌లో భూమి సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించి తీసుకో వాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ అయిన భూముల పరిశీలన ప్రక్రియను సజావుగా సాగేం దుకు జిఒ 596 నందు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందిన్నారు. రీ వెరిఫి కషన్‌ ప్రక్రియను చట్టబద్ధంగా నిబంధనల మేరకు పక్కాగా చేయాలిన్నారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వవద్దునారు. చెక్‌ లిస్ట్‌ ప్రకారం ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించాలిన్నారు. పరిశీలన ప్రక్రియలో పారదర్శకంగా ఉండా లిన్నారు. చట్ట నిబంధనలకు లోబడి పక్కగా పరిశీలన పూర్తి చేసి నిర్దేశిత నమూనాలో పూర్తి స్థాయి నివేదికలు సమర్పించాలిన్నారు. పరిశీలన ప్రక్రియలో ఎవ్వరి ఒత్తిడికి లోనుకారాదున్నారు. నివేదికకు సంబంధించిన ప్రతి ఫైలుకు అవసరమైన డాక్యుమెంట్స్‌ అన్నింటినీ జత చేయాలిన్నారు. జిల్లా వ్యాప్తంగా అసైన్మెంట్‌ భూముల పరిశీలన కూడా పూర్తిచేసి అక్టోబర్‌ 20లోగా సంపూర్తి నివే దికలు సమర్పించాలిన్నారు. అప్పగించిన విధులలో ఎవ్వరు అశ్రద్ధ చూపవ ద్దన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్వోల పరిశీలనను తహశీల్దార్లు స్వయంగా పర్యవేక్షణ చేయాల న్నారు. ఎవరైనా తప్పు దోవ పట్టించాలని చూస్తే శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని, ఎవర్ని ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొ న్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి పిజిఆర్‌ఎస్‌లో భూమి సమస్యలపై వచ్చిన దర ఖాస్తులను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన ఆర్‌ఒ ఆర్‌, భూసేకరణ, సెక్షన్‌ 22ఏ, భూ ఆక్రమణ చట్టం, హౌసింగ్‌ అసైన్మెంట్‌, అసైన్మెంట్‌ భూముల ఫ్రీహోల్డ్‌ భూముల అంశాలలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ నివేదికలతో పారదర్శకంగా దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం ఆయా మండలాలలో ఫ్రీహోల్డ్‌ భూముల రిజి స్ట్రేషన్ల పరిశీలన, అసైన్మెంట్‌ భూముల ఫ్రీహోల్డ్‌ అంశాలలో పరిశీలించాల్సిన భూములు ఎన్ని, ఎంత మేర పరిశీలించి ఇంకెంత శాతం పరిశీలించాల్సి ఉంది న్నారు. పెండింగ్‌ ఉండడానికి గల కారణాలు, ఇప్పటివరకు పరిశీలన పూర్తి చేసిన వాటిలో ఆమోదించినవి ఎన్ని, తిరస్కరించినవి ఎన్ని తదితరాలలో తహశీ ల్దార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమోదించడం లేదా తిరస్కరించడం సహేతుకంగా ఉందా లేదా అని స్పష్టమైన అన్ని ధ్రువపత్రాలు జతచేసి నివేదిక సమర్పించాలని, శ్రద్ధతో బాధ్యతాయుతంగా పరిశీలన పూర్తి చేసి నిర్దిష్ట గడువు లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో జెసి ఆదర్శ్‌ రాజేంద్రన్‌, మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, డిఆర్‌ఒ సత్యనారాయణరావు ఆర్‌డిఒ రంగస్వామి, తహశీల్దార్లు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️