ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండలనికి సంబంధించిన పదవ తరగతి సెట్ 1 పేపర్లు మంగళవారం నార్పల పోలీస్ స్టేషన్‌కు చేరాయి. ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. రెండవ సెట్ ప్రశ్నాపత్రాలు వస్తాయని విద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారులు, కృష్ణయ్య, నారపరెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నగేష్, రవికుమార్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
