పదవ తరగతి మోడల్‌ పేపర్ల ఆవిష్కరణ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ యుటిఎఫ్‌ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థుల శ్రేయస్సును కూడా దష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది మోడల్‌ పేపర్ల ప్రచురణ నిర్వహిస్తుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు తెలిపారు. మంగళవారం కడప యుటిఎఫ్‌ భవన్‌లో 10వ తరగతి మోడల్‌ పేపర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్‌ పేపర్లను సుదీర్ఘ అనుభవం, విషయ నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల చేత రూపొందించామని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, సమాధానాలు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియాల్లో ముద్రించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను దష్టిలో ఉంచుకుని కేవలం రూ.75 మాత్రమే ధర నిర్ణయించామని తెలిపారు. ఈ మోడల్‌ పేపర్స్‌ ప్రాధాన్యతను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయరామరాజు ప్రశంసిస్తూ యుటిఎఫ్‌ విద్యార్థుల శ్రేయస్సుకు తన వంతు పాత్ర వహించడం ఎంతో ప్రశంసనీయమని, ఈ పుస్తకాలు పదవ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారన్నారు. తెలివైన విద్యార్థు లు అత్యధిక మార్కులు సాధించడానికి, చదువులో వెనుకబడిన విద్యార్థులు కచ్చితంగా ఉత్తీర్ణత సాధించడానికి ఈ మోడల్‌ పేపర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించుటకు ఈ మోడల్‌ పేపర్‌ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. మోడల్‌ పేపర్లు కావాల్సిన వారు స్థానిక యుటిఎఫ్‌ నాయకులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు సి.వి. రమణ, ఏజాస్‌ అహమ్మద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ కష్ణారెడ్డి, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు సుబ్బారావు, కేదార్నాథ్‌, గోపీనాథ్‌, చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌, ప్రకాష్‌, జానకిరామ్‌ పాల్గొన్నారు.

➡️