11 నామినేషన్లు తొలగింపు: రిటర్నింగ్‌ అధికారి

ప్రజాశక్తి-దర్శి: దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 22 మంది అభ్యర్థులు 43 సెట్‌లు నామినేషన్‌ దాఖలు చేయగా అందులో 11 మంది నామినేషన్లు పరిశీలనలో తీసివేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎంఈఎస్‌ లోకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్లూరి కొండారెడ్డి ఇండియన్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇత్తడి శివప్రసాద్‌ బిఎస్పి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ, తెనాలి రవిబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి, అరెగల శ్రీనివాసులు భారత చైతన్య యువజన పార్టీ, తాటిపల్లి త్రిపురరావు జాతీయ యువజన పార్టీ, కుంచాల కోటేశ్వరరావు అంబేద్కర్‌ రాడికల్‌ ఇండియన్‌ పార్టీ, తేలుకుట్ల కళ్యాణ్‌కుమార్‌ సమాజ్‌వాది పార్టీ, మీనా మంచ స్వతంత్ర అభ్యర్థి, కమతం జాన్‌ వెస్లీ స్వతంత్ర అభ్యర్థులుగా పరిశీలనలో ఉన్నట్లు లోకేశ్వరరావు తెలిపారు.

➡️