ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : ఎమ్మార్పీఎస్ 11వ వార్షిక మహాసభను నవంబర్ 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం గుడ్లవల్లేరు లో కాంప్లెక్స్ ను విడుదల చేశారు. ఈ మహాసభను విజయవాడలోని హనుమంతరావు గ్రంథాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉదయగిరి కృష్ణారావు, ప్రశాంతి, గంధం సైమన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.