మొదటి సంవత్సరం 65 శాతం, ద్వితీయ ఇంటర్‌లో 80 శాతం ఉత్తీర్ణత
మే 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా ఫస్ట్ ఇంటర్ 12వ స్థానం, సెకెండ్ ఇంటర్‌లో 13వ స్థానంలోనూ నిలిచింది. జిల్లాలో మొదటి ఇంటర్ లో జనరల్ విద్యార్థులు 17,636మంది హాజరు కాగా 11,525 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ ఇంటర్‌లో 15,512 మంది హాజరు కాగా 12,340 మంది ఉత్తీర్ణులై 80శాతం ఫలితాలు సాధించారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు మొదటిస్థానంలో నిలిచారు. ప్రథమ ఇంటర్లో బాలురు 7937 మందికి గాను 5187 మంది ఉత్తీర్ణులై 65.35 శాతం, బాలికలు 9699 మందికి గాను 6339 మంది ఉత్తీర్ణులై 65.35 శాతం నమోదు చేశారు.ద్వితీయ ఇంటర్ లో బాలురు 6824 మంది విద్యార్థులకు గాను 5430 మంది ఉత్తీర్ణులై 79.57 శాతం, బాలికలు 8688 మందికి 6910 మంది ఉత్తీర్ణులై 79.53 శాతం ఫలితాలు సాధించారు. ఇంటర్ ఒకేషనల్ ప్రథం సంవత్సరంలో 53.87 శాతం, ద్వితీయ ఇంటర్ లో 60.82 శాతం ఫలితాలు నమోదు చేశారు.ద్వితీయ ఇంటర్ ఎంపిసిలో చైతన్యకళాశాలకు చెందిన బలగ జయేంద్ర నాయుడు 990, బైపిసిలో పి.లావణ్యశ్రీ 989 మార్కులు సాధించారు. శ్రీ వెంకటేశ్వేర ఎఐఎటి ఐఐటి నీట్ అకాడమికి చెందిన బి.రోషిని ద్వితియ ఇంటర్ ఎంపిసిలో 989 మార్కులు సాధించారు. బైపిసిలో పైలా సింగ్ 987 మార్కులు సాధించారు.
పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మే 12 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు.
మొదటి ఇంటర్లో..
మొదటి సంవత్సరం 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 1828మంది హాజరు కాగా 885 మంది ఉత్తీర్ణులయ్యారు. 48.41 శాతం ఫలితాలు నమోదు చేశారు. 13 మోడల్ స్కూల్స్ నుంచి 1105 మందికి గాను 880 మంది ఉత్తీర్ణులై 79.63 శాతం ఫలితాలు నమోదు చేశారు. 19 కెజిబివి పాఠశాలల నుంచి 589 మంది పరీక్ష రాయగా 432మంది ఉత్తీర్ణులై 73.34 శాతం ఫలితాలు నమోదు చేశారు. 8 సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 380మందికి, 314 మంది ఉత్తీర్ణులై, 82.63 శాతం ఫలితాలు నమోదు చేశారు. 5 అప్ గ్రేడ్ చేయబడిన ప్రభుత్వ హై స్కూల్ నుంచి 98 మందికి,19 మంది ఉత్తీర్ణులై,19.38 శాతం ఫలితాలు నమోదు చేశారు. 83 ప్రైవేట్ కళాశాలల నుంచి మొదటి ఇంటర్‌లో 13429 మందికి గాను 8799 మంది ఉత్తీర్ణులై 66.52 శాతం ఫలితాలు సాధించారు.
ద్వితీయ ఇంటర్ లో…
19 ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం 1376 మంది విద్యార్థులకు 958 మంది ఉత్తీర్ణులై 69.62 శాతం, 13 మోడల్ స్కూల్స్ నుంచి 853 మందికి 790 మంది ఉత్తీర్ణులై 92.61 శాతం, 19 కెజిబివిల నుంచి 419 మందికి 388 మంది ఉత్తీర్ణులై 92.60 శాతం సాధించారు. 8 సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 298 కి 274 మంది ఉత్తీర్ణులై 91.90 శాతం, హైస్కూల్ ప్లస్ ధర్మవరం నుంచి 10 మందికి 9 మంది ఉత్తీర్ణులయ్యారు. 83 ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి 12,439 మంది విద్యార్థులకు 9780 మంది ఉత్తీర్ణులై 78.68 శాతం ఫలితాలు నమోదు చేశారు.
కెజిబివి విద్యార్థినుల ప్రతిభ
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో అద్భుత ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరం మొత్తం 824 మంది విద్యార్థినులలో 641 మంది ఉత్తీర్ణత సాధించి 78శాతం విజయం నమోదు చేసారు. ద్వితీయ ఇంటర్‌లో 637 మంది విద్యార్థినులలో 581 మంది ఉత్తీర్ణత సాధించి 91శాతం సాధించారు.విభాగాల వారీగా టాప్ విద్యార్థినులు బైపిసిలో కె.అనూషా 423(మొదటి సంవత్సం), కె. శైలజ 964 మార్కులు (సెకెండ్ ఇయర్) (విజయనగరం), ఎంపిసిలో జి. తులసిశ్రీ 461 (కొత్తవలస), ఎన్. జ్యోతికా 969 మార్కులు (ఎల్.కోట) సాధించారు. ఒకేషనల్ కోర్సులో బి. హారిక 491 మార్కులు (వేపాడ), ఎస్. రమ్య 971 మార్కులు (జామి) సాధించి అగ్ర స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలు కెజిబివి విద్యార్థినుల ప్రతిభను తేటతెల్లం చేసిందని, భవిష్యత్‌లో ఉన్నత విద్యకు మార్గం సుగమం చేస్తున్నాయని సమగ్రశిక్ష ఎపిసి ఎ.రామారావు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి అభినందనలు తెలిపారు.