1200 పచ్చాకు కర్రలు అల్లి ప్రత్యేకత చాటిన అంకయ్య

ప్రజాశక్తి-సంతనూతలపాడు : బ్యారన్‌ పచ్చాకు కర్రలు ఒక్కడే అల్లి తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఓ కార్మికుడు. మండలంలోని మైనంపాడు గ్రామంలో పెరుగు వెంకట్రావు బ్యారన్‌ వద్ద బుధవారం తాళ్లూరు మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన గోగుల అంకయ్య అనే పచ్చాకు ముఠా కార్మికుడు ఒంటి గుర్రంపై 1200 పచ్చాకు కర్రలు అల్లి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.ఆయనను పలువురు అభినందించారు. సహజంగా పచ్చాకు బ్యారన్‌ దగ్గర 6 లేక 7 గుర్రాల మనుషులు పచ్చాకు కర్రలు అల్లుతుంటారు. కాని అంకయ్య ఒక్కడే ఒంటి గుర్రంపై పచ్చాకు కర్రలు అల్లి తన ప్రతేకతను చాటాడు. తుమ్మల చెన్నయ్య మేస్త్రి పచ్చాకు ముఠాలో అంకయ్య పనిచేస్తున్నాడు.

➡️