15న ఫిరంగిపురానికి ముఖ్యమంత్రి రాక

Feb 12,2024 00:41

ప్రజాశక్తి-ఫిరంగిపురం : ఫిరంగిపురంలో ఈనెల 15వ తేదీన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్నందున ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎస్పీ తుషార్‌ దూడీ, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారితో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి ప్రాంతంలో వేదిక, గ్యాలరీల నిర్మాణం, బ్యారీకేడ్లు, హెలీప్యాడ్‌, పార్కింగ్‌ ప్రదేశాలలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి పి.శ్రీఖర్‌, ఆర్‌ అండ్‌ బి ఇంజినీర్‌ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️