16న గ్రామీణ బంద్‌కు సంపూర్ణ మద్దతు : సిపిఎం

Feb 13,2024 00:21

అధికారులకు బంద్‌ నోటీసు ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి – మంగళగిరి :
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపు మేరకు ఈనెల 16వ తేదీన జరిగే గ్రామీణ బంద్‌కు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రకటించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ విస్తృత సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశానికి సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు అధ్యక్షత వహించగా రామారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే ఆందోళనలో సిపిఎం ముందుపీఠిన ఉంటుందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపో తోందని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్‌ కంపెనీలకు కారు చౌకగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కట్టబెడు తోందని విమర్శించారు. నిత్యా వసర వస్తువుల ధరలను నియంత్రించలేని పరిస్థి తిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపితో కలిసి వెళుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపుని చ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో అనేక రకాల ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న వారందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని, తాడేపల్లి రైల్వే స్థలాల్లో నివాస ముంటున్న పేదల ఇళ్లను తొలగించవద్దని డిమాండ్‌ చేశారు. దుగ్గిరాల కోల్డ్‌ స్టోరేజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఎం.రవి, ఇ.అప్పారావు, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, ఎం.పకీరయ్య, పి.బాలకృష్ణ, తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, రూరల్‌ కార్యదర్శి డి.వెంకట్‌రెడ్డి, దుగ్గిరాల మండల కార్యదర్శి జె.బాలరాజు, నాయకు లు వి.దుర్గారావు, ఎం.భాగ్యరాజు, వి.వెంక టేశ్వరరావు, డి.శ్రీనివాస్‌కుమారి, బి.కోటే శ్వరి, దుర్గారావు, ఎం.బాలాజీ పాల్గొన్నారు.
అధికారులకు నోటీసులు
దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16న జరిగే బంద్‌లో భాగంగా మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొంటారని సిఐటియు, ఏఐటియుసి, ఎఐఎఫ్‌టియు నాయకులు తెలిపారు. ఈ మేరకు నోటీసును కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమవారం అందించారు. పట్టణంలో వివిధ ప్రభుత్వ కార్యాలయంలో సమ్మె నోటీసులను అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, పట్టణ కార్యదర్శి ఎం.బాలాజీ, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన ార్యదర్శి పి.బాలకృష్ణ, సిఐటియు పట్టణ నాయకులు టి.శ్రీరాములు, ఎఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్నిసత్యనారాయణ, ఎఐఎఫ్‌టియు నాయకులు కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తాడికొండ : స్థానిక పాత మహల్‌ నందు రైతు సంఘం మండల సమావేశంలో ఏరువా అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరు కుమార్‌ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో 70 శాతం ప్రజానికం జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిం చారు. ఢిల్లీలో రైతులు జరిపిన ఉద్యమా లతో తలోగ్గిన నరేంద్ర మోడీ మద్దతు ధరల చట్టాన్ని తీసుకు వస్తానని ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని, పైగా వ్యవ సాయ రంగానికి కేటాయింపులు తగ్గిం చడం, కేటాయించిన నిధులను ఖర్చుచేయ కపోవడం వంటివాటికి పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు సబ్సిడీలు, పంట నష్టపరిహారం అందరడం లేదన్నారు. డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయకుండా ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం మోసపూరితమని విమ ర్శించారు. దేశంలో 5.30 లక్షల ప్రైవేటు చిన్న తరహా కంపెనీలు మూత పడ్డాయని, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. కార్పొరేట్‌ వ్యవసాయాన్ని తేవడానికి, రైతులకు నష్టపరిచేలా తెచ్చిన భూ హక్కు చట్టాన్ని తిప్పికొట్టాలన్నారు. ఇందులో భాగంగా బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘం మండల కార్యదర్శి కె.పూర్ణచంద్రరావు, సిహెచ్‌.భాస్కరరావు, ఐ.రామారావు, బి.భద్రయ్య, ఎం.జోషి, ఐ.నాగేశ్వరరావు షేక్‌ సుభాని, కె.స్రవంతి పాల్గొన్నారు.

➡️