16న తలపెట్టిన దేశవ్యాప్త రవాణా బందును విజయవంతం చేయండి

Feb 13,2024 16:15 #anakapalli
  • సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము పిలుపు

ప్రజాశక్తి అచ్యుతాపురం(అనకాపల్లి) : దేశవ్యాప్తంగా ఈనెల 16న శుక్రవారం తలపెట్టిన రవాణా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము పిలుపునిచ్చారు. అచ్చుతాపురం మండల కేంద్రంలో మంగళవారం దేశవ్యాప్త రవాణా బంద్ ప్రచారాన్ని ఆయన ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. రహదారులపై మోటార్ వాహనాల డ్రైవర్లతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లకు ప్రమాదకరమైన సెక్షన్ 1 0 6 ను ప్రవేశపెట్టిందన్నారు ఆ చట్టం ఆ సెక్షన్ ద్వారా డ్రైవర్లకు రాబోయే కాలంలో పలు సమస్యలు ఎదురవుతాయి అన్నారు. మోటారు వాహన చట్టం 2019 సవరించాలని ఆయనే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 2023 చట్టం ప్రకారం డ్రైవింగ్ వలన వ్యక్తి మరణిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా డ్రైవర్లు భరించాల్సి వస్తుంది అన్నారు. దేశంలో రహదారుల పరిస్థితి అద్వానంగా ప్రమాదాలకు నిలయంగా మారాయన్నారు. పరిస్థితులు బాగో లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతాయని డ్రైవర్లు కావాలని ఎటువంటి ప్రమాదాలు చేయరని ఆయన చెప్పారు. సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి వాహనాలు కొనుగోలు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమైనదని ఆయన గుర్తు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ రెన్యువల్ ఈ చలానాలు భారీగా పెంచారని పోలీస్ కేసులు ఆర్డీవో కేసులతో వచ్చే ఆదాయం సరిపోవటం లేదని ఆయన తెలిపారు. పెట్రోలు డీజిల్ ధరలు జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని ఫ్రీ బస్ సర్వీసుల వలన ఆటో డ్రైవర్లకు కలిగే నష్టాన్ని పరిహారంగా నెలకి 12 వేల రూపాయలు చొప్పున చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

➡️