Awards – 16వ వల్లూరుపల్లి వెంకటరామ శేషాద్రిరావు స్మారక బహుమతుల ప్రదానోత్సవం

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : 16వ వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రి రావు స్మారక బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించారు. వార్షికంగా సాంకేతిక విద్యామండలి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌ విద్యలో ప్రభుత్వ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ లలో రాష్ట్ర మొదటి ర్యాంకర్‌ కు ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ లలో మొదటి, ద్వితియ ర్యాంకర్స్‌ కు ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించిన వి.వి.ఆర్‌.ఎస్‌.ఆర్‌ స్మారక అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 2024 వ సంవత్సరానికిగాను మొదటి, ద్వితీయ ర్యాంకర్స్‌ కు బంగారు పతకాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.పద్మారావు, జాయింట్‌ డైరెక్టర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ వారు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రిన్సిపాల్‌ శ్రీ.ఎన్‌.రాజశేఖర్‌ మాట్లాడుతూ … అవార్డులు పొందిన ఇద్దరు విద్యార్థులు ఆడపిల్లలని వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, సన్నిహితులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ అవార్డులు ప్రకటించడానికి సాంకేతిక శాఖ వారు ఎంతగానో కృషి చేసారని వారికీ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరిస్తున్న యాజమాన్య సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసారు.

అనంతరం ముఖ్య అతిధిగా విచ్చేశిన శ్రీ వెలగా పద్మారావు, జాయింట్‌ డైరెక్టర్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. పాలిటెక్నిక్‌ లాభాపేక్ష లేని ఒక విద్యా వ్యవస్థగా స్థాపించడంలో శ్రీ వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రి రావు గారు ముఖ్య భూమిక పోషించారని తర్వాత కాలంలో వారి స్ఫూర్తి చిహ్నంగా వారి కుటుంబ సభ్యులు శేషాద్రి రావు గారి పేరు మీద మూడు అవార్డలను నెలకొల్పి రాష్ట్ర పాలిటెక్నిక్‌ సాంకేతిక విద్యలో అత్యున్నత మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి, అలాగే ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ విద్యలో అత్యున్నత మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి అవార్డుల ప్రధాన చేయడం చాలా గొప్ప విషయమని శేషాద్రి రావు గారి సేవలను కొనియాడారు. విద్యార్థులు ఎప్పుడు ఆకాశమే హద్దుగా ప్రయత్నాలు చేయాలని మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం విద్యను సమపార్జుని చేయాలని, సానుకూల దఅక్పథంతో ఆలోచనలు చేస్తే ప్రతి ఆలోచన అవకాశం గా మారుతుందని విద్యార్థులను ఉద్దేశించి హితవు పలికారు. విద్యా సంస్థలలో అల్యూమిని అసోసియేషన్‌ నెలకొల్పడం ద్వారా బాగా స్థిరపడిన విద్యార్థుల సలహాలు సంప్రదింపులతో పాలిటెక్నిక్‌ విద్యను మరింత పటిష్టవంతం చేయగలమని సలహా ఇచ్చారు గోల్డ్‌ మెడల్స్‌ పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం 2024 వ సంవత్సరంలో రాష్ట్రంలో అన్నీ ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ లలో మొదటి ర్యాంకు సాధించినందుకు గాను కుమారి పి.రిషిక కు (21030-ఈసి-161), రూ.10000/- విలువగల బంగారు పతకాన్ని, రూ.10000/- నగదును మరియు డి.టి.ఇ వారు ద్రువీకరించిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అదే విధంగా రాష్ట్రంలో అన్నీ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ లలో మొదటి ర్యాంకు సాధించినందుకు గాను కుమారి పి.రిషిక కు (21030-ఈసి-161), రూ.10000/- విలువగల బంగారు పతకాన్ని, రూ.10000/- నగదును మరియు డి.టి.ఇ వారు దఅవీకరించిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో అన్నీ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ లలో ద్వితియ ర్యాంకు సాధించినందుకు గాను కుమారి ఎ.యశస్వినీ (21030-ఈసి-017), రూ.5000/- విలువగల బంగారు పతకాన్ని, రూ.5000/- నగదును, డి.టి.ఇ వారు ధ్రువీకరించిన ప్రశంసా పత్రాన్ని , జాయింట్‌ డైరెక్టర్‌ చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కఅతిక నఅత్యాలు అతిధులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి సంస్థల ప్రెసిడెంట్‌ వల్లభనేని సుబ్బారావు , కో- సెక్రటరీ కరెస్పాండంట్‌ శ్రీ వి.రామకఅష్ణ , ఎస్‌.ఆర్‌. జి.ఇ.సి. ప్రిన్సిపాల్‌ శ్రీ డాక్టర్‌.బి కరుణ కుమార్‌ , ఫార్మసి కాలేజి ప్రిన్సిపాల్‌ శ్రీ ఎ.లక్ష్మణరావు, స్కూల్‌ డైరెక్టర్‌ శ్రీ ఎన్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఎగ్జిక్యూటివ్‌ మెంటర్‌ ప్రిన్సిపాల్‌ , విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పాలిటెక్నిక్‌ విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

➡️