17న లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ

Feb 12,2024 20:10

ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరంలోని సోనియా నగర్‌ పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సోమవారం ఎపి టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ పరిశీలించారు. ఈనెల 17న ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో 1056 గృహాలు, విజయనగరం సారిపల్లిలో 1088 గృహాలు మొత్తంగా 2144 గృహాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో గృహ సముదాయాలలో జరుగుతున్న నిర్మాణ పనులను ఇంజినీరింగ్‌, మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టిడ్కో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ డి.నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జ్యోతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌లు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎంఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️