కేతిముక్కల అగ్రహారంలో ఆర్‌బికె సిబ్బంది, రైతులతో మాట్లాడుతున్న ఐ. మురళి
పల్నాడు జిల్లా: ఇటీవల సంబంవించిన మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో నష్టపోయిన పంటల అంచనా వివరాలు నమోదు పార దర్శక ంగా జరగాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ.మురళి వ్యవసాయ శాఖ అధి కారులకు, సహాయకులకు సూచించారు. నరసరావుపేట మండలంలోని కేతి ముక్కల అగ్రహారంలో నష్టపోయిన పం టల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఈ నెల 18 లోగా ఆయా పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు రైతు భరోసా కేంద్రంలో సిబ్బందిని సంప్రదించి దెబ్బ తిన్న పంటల ఎన్యూమురేషన్ చేయించు కోవాలని సూచించారు. ఈ నెల 22న సామాజిక తనిఖీ నిమిత్తం రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుం దన్నారు. అభ్యంతరాలు ఏమైనా సరి చేసి 23 న తయారు చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ ద్వారా కమిషనర్ కు ఇన్పుట్ సబ్సిడీ కోసం పంపించడం జరు గుతుందన్నారు. ప్రస్తుతం శనగ సాగుకు సరైన సమయం కావడంతో దెబ్బతిన్న శనగ దున్ని వేసి మళ్ళీ శనగ సాగు చేసే రైతులకు రాయితీ పై శనగ విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎడిఎ పి.మస్తానమ్మ, నరసరావుపేట మండల వ్యవసాయ అధి కారి వి.నరేంద్రబాబు, ఏఈఓ కె. బ్రహ్మయ్య, పి.పవన్ పాల్గొన్నారు. నకరికల్లు: మండలంలోని దేచవరం చల్లగుండ్ల గ్రామంలో రైతుల పంట నష్ట అంచనాల ప్రక్రియను పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ.మురళి పరిశీలించారు. శనగ, కంది పంటలు 33 శాతం కంటే ఎక్కువ క్షేత్రాలను పరిశీలించారు కార్య క్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి దేవదాసు, వీఆర్వో యువరాజు, గ్రామ వ్యవసాయ సహాయకులు దిలీప్ కుమార్, కె.రవిబాబు, ఉప సర్పంచ్ రమణారెడ్డి,రైతులు పాల్గొన్నారు. దెబ్బతిన్న మిర్చి పంటల పరిశీలన అమరావతి: మండలం పరిధిలోని ధరణికోట, నరుకుళ్ళపాడులలో దెబ్బతిన్న మిర్చి పంటను బుధవారం పల్నాడు జిల్లా ఉద్యాన శాఖ అధికారి బెన్ని పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పొలాలను సందర్శించి పంట నష్ట తీవ్రతను అధ్యయనం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం అందేలాగా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి కిషోర్,ఉద్యానవన సహాయకులు శ్రీలక్ష్మి పాల్గొన్నారు.