ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం ధోబి ఘాట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మొత్తం 18 పడవలను సోమవారం ఉదయం అధికారులు సీజ్ చేశారు. రైలు కం రోడ్డు, గ్రామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుకను తీయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, కొందరు బోట్స్ మెన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువుగా నీరు ఉందని సాకు చెబుతూ.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కం రైలు బ్రిడ్జి, గ్రామన్ బ్రిడ్జిహొ సమీపంలో అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 బోట్స్ ను సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్ మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారి జేసి.చిన్నరాముడు తెలిపారు.