ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : 19 అంగుళాల చిన్ని దూడను చూడటానికి జనాలు ఆసక్తి చూపిన వైనం శనివారం డౌలైస్వరంలోని స్థానిక అగ్రహారంలో చోటుచేసుకుంది. అగ్రహారంలోని మొదటి వీధికి చెందిన తాడల.సాయి శ్రీనివాస్ ఎంబిఎ చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయికి మూగ జీవాలపై ఉన్న ప్రేమతో గత 3 సంవత్సరాల నుండి తన ఇంట్లో పంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుకుంటున్నాడు. ఈరోజు ఉదయం ఆ ఆవు 19 అంగుళాల దూడకు జన్మనిచ్చింది. ఈ దూడ అతి చిన్నగా చూడచక్కగా ఉండటంతో చుట్టుపక్కలవారు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు.
