గ్యాంగ్‌రేప్‌ కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

Oct 8,2024 23:43

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో మూడేళ్ల కిందట కలకలం సృష్టించిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.66వేల జరిమానా విధిస్తూ గుంటూరు 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.నీలిమ మంగళవారం తీర్పునిచ్చారు. మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భార్యాభర్తలు 2021 సెప్టెంబర్‌లో ఒక ఫంక్షన్‌కి వెళ్లి రాత్రి 10 గంటలకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో నలుగురు అడ్డగించారు. భర్తను కాళ్లు చేతులు కట్టేసి వేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డంతోపాటు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. ఈ కేసులో ఒకరు పరారీలో ఉండగా మరొకరు మైనర్‌ కావడంతో జూవెనల్‌ కోర్టుకి బదిలీ అయ్యాడు. మిగతా ఇద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దోషులు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన మరొకరికి మూడేళ్ల జైలుశిక్ష రూ.5వేలు జరిమాన విధించారు. ప్రాసిక్యూషన్‌ తరపున పల్లపు కృష్ణ వాదించగా అప్పటి సీఐ కె.మారుతికృష్ణ కేసు దర్యాప్తు చేశారు.

➡️