ప్రజాశక్తి-నూజివీడు టౌన్ (ఏలూరు): రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజివీడు నేషనల్ సర్వీస్ స్కీమ్‌లో భాగంగా 200 మంది వాలంటీర్స్ కలిగిన యూనిట్-3, యూనిట్-07 బృందం ”స్వచ్ఛతాహి సేవా” కార్యక్రమానికి ఎంపికైనందుకు వాలంటీర్లు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. ఈ సందర్బంగా ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ – 03, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ – 07 వాలంటీర్స్ క్యాంపస్ గేట్ దగ్గర నుండి యానడుల కొలనీ వరకు ర్యాలీగా వెళ్లి పర్యావరణ పరిశుభ్రత గురించి, ప్లాస్టిక్ నిషేధం, డ్రైనేజీలు పరిశుభ్రత, మొక్కులు నాటడం మీద ఆవశ్యకతను తెలియచేశారు. యానాదుల కాలనీ లోని స్కూల్ చుట్టూ పక్కలా పిచ్చి మొక్కలను తీసి, మొక్కలు నాటడం ”స్వచ్ఛతాహి సేవా” కార్యక్రమాన్ని ద్వారా చేపట్టినట్లు ఎన్.ఎస్.ఎస్ విభాగ సమన్వయ కర్త శ్రావణి కనక కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ లోని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం బొత్స శ్రీనివాసరావు, జాజుల మధు పాల్గొని వారి యూనిట్లలోని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీ.ఆర్.వో సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ విభాగాన్ని డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ , ఏవో లక్ష్మణరావు, అభినందించారు.
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమానికి 200 మంది త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఎంపిక
