21, 22 తేదీల్లో మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం

 మంగళగిరి: మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం రెండో పిల్లల పండుగను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోగల యర్ర బాలెంలోని డాన్‌ బాస్కో ఉన్నత పాఠశాలలో ఈ నెల 21, 22 తేదీల్లో బాలోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం మంగళగిరి ఎకో పార్కులో ది మంగళగిరి వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను నిర్వాహకులు కలిసి అసోసియేషన్‌ తరఫున సహాయ సహకారాలు అం దించాల్సిందిగా కోరారు. ఈ మేరకు బాలోత్సవం అధ్య క్షులు, నిర్మల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వీవీ ప్రసాద్‌, కోశాధికారి, తాడేపల్లికి చెందిన సీనియర్‌ జర్న లిస్టు గాదె సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు, సీకే జూనియర్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ మంచా విజయమోహన రావు, కార్యదర్శి, వీజే జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాల డైరెక్టర్‌ ప్రెగడ రాజశేఖర్‌ లు ఎకో పార్కుకు విచ్చేశారు. ఈ సందర్భంగా వాకర్స్‌ రచ్చబండ వద్ద వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పెద్దిరాజు, వాకర్స్‌ ప్రతినిధులకు బాలోత్సవం కార్యక్రమ వివరాలను వెల్లడించి అసోసియేషన్‌ సహకారం కోరారు. డాన్‌ బాస్కో హైస్కూల్లో ఈ నెల 21, 22 తేదీల్లో సబ్‌ జూనియర్స్‌ 3, 4, 5 తరగతులు, జూని యర్స్‌ 6, 7 తరగతులు, సీనియర్స్‌ 8, 9, 10 తర గతుల విద్యార్థినీ విద్యార్థులకు కల్చరల్‌, అకడమిక్‌ ఈవెంట్లలో విభాగాల వారీగా జరుగుతాయని, విభిన్న రంగాల్లో విద్యార్థినీవిద్యార్థుల్లో దాగివున్న ప్రతిభాపాఠవాలను వెలికితీసేందుకు ఓ పండుగ వాతా వరణంలో నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం నిర్వాహకులు తెలిపారు. కల్చరల్‌ ఈవెంట్లలో జానపద నృత్యం, దేశభక్తి, అభ్యుదయ గీతాలు, లఘునాటికలు, శాస్త్రీయ నత్యం, ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్‌, విచిత్ర వేషధారణ, కోలాటం, రైమ్స్‌ పోటీలు విభాగాల వారీగా ఉంటాయి. అకడమిక్‌ ఈవెంట్లలో చిత్ర లేఖనం, వ్యాసరచన (తెలుగు, ఇంగ్లీష్‌), కథారచన (తెలుగు), కవితా రచన, ఉపన్యాసం (తెలుగు, ఇంగ్లీష్‌), స్వచ్ఛ తెలుగు, పద్యభావం, స్పెల్‌ బి (ఇంగ్లీష్‌), మ్యాప్‌, క్విజ్‌, మట్టితో బొమ్మలు వంటి అంశాలు విభాగాల వారీగా నిర్వ హిస్తారు. బాలోత్సవం వివరాలు తెలుసుకున్న ది మంగళగిరి వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు నిర్వా హకులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినీ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం, స్నేహ భావం, సామాజిక స్పహ ఇత్యాది కల్పించేందుకుగాను మంగళగిరి ప్రాంతంలో నిర్వహిస్తున్న బాలోత్సవానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

➡️