2,300 కేజీల పిడిఎస్‌ బియ్యం పట్టివేత

Jan 10,2025 21:29

ప్రజాశక్తి – బలిజిపేట : మండలంలోని జనార్ధనవలస వద్ద 2300 కేజీల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. శ్రీకాకుళం విజిలెన్స్‌ ఎస్‌పి బి.ప్రసాదరావుకు అందిన ముందస్తు సమాచారం మేరకు మండలంలోని జనార్దనవలస నుంచి రేషన్‌ బియాన్ని అక్రమంగా ఒడిశాకు తరలిస్తున్న బొలేరా వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వాహనం, బియ్యం యజమాని అయిన వంగర మండలం లక్ష్మీంపేటకు చెందిన ఆవు చిన్నంనాయుడుపై 6ఎ, క్రిమినల్‌ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎస్‌ఐ బి.రామ్మోహనరావు తెలిపారు. ఈ దాడుల్లో స్థానిక సిఎస్‌డిటి ఎన్‌.రమేష్‌, విజిలెన్స్‌ సిబ్బంది పురుషోత్తం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️