24 గంటలూ అందుబాటులో ఉంటా: కుందురు

ప్రజాశక్తి-అర్థవీడు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని వైసిపి గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. అర్థవీడు సచివాలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం పార్టీ మండల నాయకులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జునరెడ్డి ప్రసంగిస్తూ అర్ధవీడు మండల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో మండల ప్రజలు తనను ఆదరించి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 60 రోజులు కష్టపడి పనిచేసి 60 నెలలు అభివృద్ధిని సాధిద్దామని అన్నారు. మండలంలో ఉన్న సమస్యలను మన ప్రభుత్వం రాగానే ఒక్కొక్కటిగా తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాస్‌రెడ్డి, అర్ధవీడు ఎంపీపీ వెంకట్రావు, అర్ధవీడు జడ్పిటిసి చెన్ను విజయ, నన్నేపోయిన రవికుమార్‌, మాజీ ఎంపీపీ వైస్‌ ఎంపీపీ సుబ్బారెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు చేగిరెడ్డి పోతిరెడ్డి, జేఏసీ కృష్ణారెడ్డి, అర్ధవీడు సర్పంచి మునగాల వసంతమ్మ, సర్పంచులు వెంకట్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రమేష్‌, వెంకటేశ్వర్లు, వైసిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️