కలుషిత నీరు తాగి 25 మందికి అస్వస్థత

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగు పట ్టణంలోని కన్నెలూరు, నేతాజీ నగర్‌లో కలుషిత నీరు తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. మంగళవారం రాత్రి ప్రజలు కలుషితమైన నీరు తాగడంతో పలు వురికి బుధవారం ఉదయం నుంచి కళ్లు తిరగడం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన వారి స్థానిక క్యాంబెల్‌, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజులుగా తాగు నీరు మురికిగా, వాసనతో వస్తున్నట్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసు కోకపో వడంతో కలుషిత నీటిని తాగి అస్వస్థతకు గుర య్యారని స్థానికులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిఐ, ఎస్‌ఐ, అధి కారులు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనపై కమిషనర్‌ వెంకట రామిరెడ్డి స్పంది స్తూ ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గుర వ్వగానే నేతాజీనగర్‌, కన్నెలూరుకు నీటి సరఫరా నిలిపేసి, ట్యాంకర్ల ద్వారా అంది స్తున్నామని చె ప్పారు. నీటి సాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదినా రాయణరెడ్డి ఫోన్‌ ద్వారా స్పందిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి పట్టణంలో కన్నెలూరు, నేతాజీ నగర్‌ కాలనీలలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎపి చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారా యణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివ కుమార్‌ తెలిపారు. బుధవారం వారు జమ్మల మడుగులో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా నీరు దుర్వాసన వస్తోందన్నారు. అధికా రులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

➡️