ప్రజాశక్తి-యల్లనూరు (అనంతపురం) : దళితుల ఇండ్లకు కరెంటు ఛార్జీల భారాలు వేస్తున్నారని, ఓ దళితుడి ఇంటికి ఏకంగా రూ.25,980 కరెంటు బిల్లు వేశారని, బిల్లు కట్టలేకపోతే కరెంటు కనెక్షన్ తీసేస్తున్నారని దళిత సంఘాలు వాపోయాయి. ఎస్సి ఎస్టీ దళిత గృహ విద్యుత్ బిల్లులపై సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు దళిత సంఘాలు, ఎం ఆర్ పి ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తహసీల్దార్ రాజ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ … ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎస్సి ఎస్టీ ల గృహాలకు విద్యుత్ బిల్లు వచ్చిందే లేదని గతం లో కూడా ఎస్సి లు గృహ విద్యుత్ వినియోగంలో ఎక్కువ వాడిన దాఖలాలు లేవని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విద్యుత్ వాడకం చేశారన్నారు. గత ప్రభుత్వం వైసీపీ పార్టీ లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సి ఎస్టీ లకు 200 యూనిట్ లకు వరకు గృహ విద్యుత్ ఉచితం ప్రకటించారనీ, అప్పటి నుండి నిబంధనల మేరకు విద్యుత్ వాడకం జరుపుకుంటున్నామన్నారు. ఎస్సి ఎస్టీ లకు విద్యుత్ అధికారులు సరైన అవగాహన కల్పించడం లో విఫలం అవ్వడమే కాక గఅహాలకు విద్యుత్ తీగలను తొలగించడం చాలా బాధాకరం అన్నారు. యల్లనూరు స్థానిక కేంద్రంలో ఎస్సి దళిత సామజిక వర్గానికి చెందిన బాలరాజు గృహానికి విద్యుత్ బిల్లు ఏకంగా రూ.25980 వచ్చిందని తెలిపారు. తాను పుట్టినప్పటి నుండి విద్యుత్ బిల్లు ఇంత మొత్తం చూడలేదని ఇదే తొలిసారి అని బాధితుడు తెలిపాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం విద్యుత్ అధికారులు అత్యుత్సాహం తో గఅహలకు విద్యుత్ లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. దీంతో గృహ వసరాల నిమిత్తం విద్యుత్ ను కట్ చేయకుండా ఆపాలని తహసీల్దార్ రాజు కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ బాలనరసింహులు, నరసింహ, ప్రహ్లాద, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
దళితుడి ఇంటికి రూ.25,980 కరెంటు బిల్లు – దళిత సంఘాల నిరసన
