క్యాంపస్‌ డ్రైవ్‌లో 27 మంది ఎంపిక

Jun 8,2024 23:39 #Basara college, #job mela
Basara College, Job mela

ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక బాసర డిగ్రీ కళాశాలలో శనివారం హెటిరో ఫార్మసీ సంస్థ నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో వివిధ ఉద్యోగాలకు డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు 27 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్‌ సిహెచ్‌ సురేష్‌ తెలిపారు. క్యాంపస్‌ డ్రైవ్‌లో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్‌ పూడి రమేష్‌, ప్రిన్సిపల్‌ సురేష్‌, ఎఒ కేశవ, అధ్యాపకులు అభినందించారు. హెటిరో సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్లు నరేష్‌, రాజు పాల్గొని విద్యార్థులకు ఇంటర్యులు నిర్వహించారు.

➡️