యూరియా కలిపిన నీరుతాగి 27 గొర్రెలు మృతి

ప్రజాశక్తి-చెన్నూరు మండలంలోని బుడ్డయపల్లె గ్రామ సమీపంలోని ఇటుకల బట్టి వద్ద బుధవారం ఉదయం యూరియా కలిపిన నీరు తాగి 27 గొర్రెలు మృతి చెందాయి. మరో 60 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. పెండ్లిమర్రి మండలం కార్పొరేట్‌పల్లె గ్రామానికి చెందిన గంగిరెడ్డి, బాల గంగయ్య, వడ్డెరపు చిట్టిబాబు, వీరాంజనేయులు, గంగరాజు, ప్రసాదు గొర్రెలను చెన్నూరు చుట్టుపక్కల పొలాలలో మేపుకొనేందుకు వచ్చారు. రోజులాగే అక్కడ వారు గొర్రెలను మేపుకొనుచుండగా కొన్ని గొర్రెలు పక్కనే ఉన్న ఇటుకల బట్టి వద్ద నీటిని తాగడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. గమనించిన గొర్రెల కాపర్లు ఇటుకల బట్టి యజమానిని తొట్టిలో ఉన్న నీటిలో యూరియా కలిపావని నీరు తాగిన మా గొర్రెలు చనిపోయాయయిన అడుగగా, ఇటుకల బట్టి యజమాని బాషా వారిపై దుర్భాషలాడుతూ నీటిలో యూరియా కలిపానని, నీ ఇష్టం వచ్చినవారికి చెప్పండని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని గొర్రెల కాపర్లు పోలీసులు, పశు వైద్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు దష్టికి తీసుకువెళ్లారు. జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షుడు చిన్న మల్లయ్య యాదవ్‌, అఖిల భారత యాదవ సంఘం కార్యదర్శి చీర్ల చెన్నయ్య యాదవ్‌, మండల పశువైద్యాధికారి డాక్టర్‌ ఉపేంద్ర, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బాలయ్య యాదవ్‌ సంఘటనా స్థలంలో మతి చెందిన గొర్రెలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. యూరియా కలిపిన నీటి తొట్ల దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని విచారించగా ఇటుకలు నాణ్యత కోసం ఏరియా కలపాల్సి వచ్చిందని వారికి వివరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరమణ, ఖాజీపేట పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మురళి, కడప పశుసంవర్ధక శాఖ లాబరేటరీ డాక్టర్లు జి.రాంబాబు, సంధ్యారాణి, మండల పశువైద్యాధికారి డాక్టర్‌ ఉపేంద్ర, విఆర్‌ఒ వెంకటసుబ్బయ్య, పోలీసులు అక్కడికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. యూరియా కల్పిన నీటిని మతి చెందిన గొర్రెల నుంచి కొన్ని పదార్థాలను పరిశోధన కోసం పశుసంవర్ధక శాఖ అధికారులు ల్యాబ్‌కు తీసుకువెళ్లారు. అటు గొర్రెల కాపర్లు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెందిన బాల గంగయ్యకు చెందిన గొర్రెలు వడ్డేపు చిట్టి బాబుకు సంబంధించి గొర్రెలు, వీరాంజనేయులు కు సంబంధించి మూడు గొర్రెలు మ తి చెందినట్లు నిర్ధారించారు. మండల పశువైద్యాధికారి. డాక్టర్‌ ఉపేంద్ర మాట్లాడుతూ అస్వస్థతకు గురైన గొర్రెలను మందల నుంచి వేరుచేసి వాటికి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. ఇటుకల బట్టి యజమాని తమ గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వాలని గొర్రెల కాపరులు డిమాండ్‌ చేశారు.

➡️