ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : సోమవారం జరగనున్న పది పరీక్షలకు సంబంధించి విద్యా శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన 288 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు శనివారం ఎంఇఓ నాగేశ్వర నాయక్ తెలిపారు. ముద్దనూరు బాల, బాలికోన్నత, ఉప్పలూరు, రాజుల గురువాయపల్లె, యామవరం గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 217 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. నాలుగు ప్రయివేటు పాఠశాలకు సంబంధించి 71 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ముద్దనూరులోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 141, బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 147 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఎంఇఓ చెప్పారు.
