పాలకొల్లులో ఉదయం 3 నామినేషన్లు దాఖలు

Apr 19,2024 12:25 #3, #Nominations, #Palakollu

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం రెండవ రోజు ఉదయం 11 గంటల వరకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. టిడిపి తరపున ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కాంగ్రెస్‌ తరపున కొలుకులూరి అర్జునరావు, జై భారత్‌ పార్టీ తరపున బెజవాడ తులసీ లు నామినేషన్‌ దాఖలు చేశారు. డిఎస్పీ శ్రీనివాసరావు సారధ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా 100 అడుగుల లోపలికి అనుమతించలేదు.

➡️