కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి

Nov 28,2024 16:22 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ :  కర్నూలు జిల్లాలో ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శ్రీనివాసులు కు చెందిన 30 గొర్రెలు బుధవారం రాత్రి కుక్కల దాడిలో మృతి చెందాయి. దీంతో ఆయనకి రూ . 2 లక్షల నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల సహకార సంఘం అధ్యక్షులు కె.శ్రీనివాసులు బాధితులను పరామర్శించి రూ. 5000/- నగదు ఆర్ధిక సహాయం అందజేసి, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ తాండ్రపాడు సర్పంచ్ బాలపీర మాట్లాడుతూ… కన్న పిల్లల్లా పెంచుకున్న 30 గొర్రెలు కుక్కల దాడిలో చనిపోవడం దారుణం అన్నారు. ప్రభుత్వం వెంటనే బాధితులకు నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించిన వారిలో కర్నూలు జిల్లా కురువ సంఘము ఉపాధ్యక్షులు, పెద్దపాడు ధనుంజయ, కురువ వెంకటరాముడు, తిరుమలేష్, మద్దిలేటి పాల్గొన్నారు.

➡️