డాక్టర్ రియాజ్ బేగ్ ప్రజాశక్తి – రాయచోటి టౌన్ 35 ఏళ్ల నుండి 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు గ్లకోమా కంటి పరీక్ష చేసుకోవాలి డిపిఎం డాక్టర్ రియాజ్ బేగ్ అన్నారు. సోమవారం ప్రపంచ గ్లకోమా సందర్భంగా ఈనెల 16వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్లకోమ అనేది కంటికి సంబంధించిన వ్యాధి అని కంటి లోపల పీడనం పెరిగి కంటి నరాలు సచ్చు పడి పోయేవిదంగా చేసి ఫలితంగా రాను, రాను కంటి చూపు తగ్గిపోతుందన్నారు. ఈ గ్లాకోమ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణా లు కనపడక పోయిన ప్రాధమిక దశలో గ్లాకోమ లక్షణాల వల్ల 40 ఏళ్లకుపై బడిన వ్యక్తులు తరచూ అద్దాలు మార్చవలసి రావడం, వెలుతురు చుట్టూ రంగు వలయం ఏర్పడటం, తరచుగా తలనొప్పితో పాటు కంటి ఎరుపు, వాంతులు, కనుగుడ్డు నొప్పి కలిగి ఉండటం, వంటివి ఉంటాయని పేర్కొన్నారు. 35 నుండి 40 ఏళ్లలోపు ప్రతీ ఒక్కరూ ఈ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. గతంలో కనుగుడ్డుపై ఏదైనా గాయం తగిలిన, స్టైరైడ్ మందులు అధికంగా వాడిన షుగర్, బిపి ఉన్నవారు, రక్త సంబంధీకులలో ఎవరికైనా గ్లాకోమ వ్యాధితో వస్తుం దని తెలిపారు. అలాంటి వారు అన్ని సామాజిక, ఏరియా వైద్యశాల ఆసు పత్రులలో ఆప్తమాలజిస్ట్‌ల దగ్గర గ్లాకోమ పరీక్ష చేసుకోవాలని. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సిఎస్‌ఆర్‌ఎమ్‌ఒ డాక్టర్ కిరణ్ కుమార్, ఆప్తల్మిక్ అసిస్టెంట్ కల్పన, ప్రజలు పాల్గొన్నారు.
