ప్రజాశక్తి-పులివెందుల రూరల్ పులివెందుల మండలానికి సంబంధించి 16 మద్యం షాపులకు 389 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సిఐ చెన్నారెడ్డి, జిల్లా టాస్క్‌ఫోర్సు సిఐ విశ్వనాథ్‌రెడ్డి అన్నారు.ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గం లోని 16 మద్యం షాపులకు సంబంధించి 389 దరఖాస్తులు వచ్చాయన్నారు. పులివెందుల 151 , వేంపల్లి 131, వేముల 19, లింగాల 31,చక్రాయపేట 27 దరఖాస్తులు వచ్చాయన్నారు.. దరఖాస్తుల అన్నిటికీ ఈనెల 16న కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో డ్రా తీస్తారని తెలిపారు. లక్కీ డిప్ లాటరీ ఎవరు తగిలితే వారికి మద్యం షాపులు ఇస్తారని పేర్కొన్నారు.