50 కుటుంబాలు టీడీపీలో చేరిక

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడితో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న జగన్‌రెడ్డి అరాచక పాలనను ఖండిస్తూ బేస్తవారిపేట మండలం జేబికే పురం గ్రామ మాజీ సర్పంచ్‌ చెట్లం రామకోటయ్య, అర్ధవీడు మండలం, మాగుటూరు తండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు బాలవర్ధినాయక్‌ వారి అనుచరులతో సహా వైసీపీని వీడి టీడీపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి టీడీపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాగుటూరు తండా గ్రామస్థులు డుమావత్‌ తులేనాయక్‌, దేశావత్‌ శ్రీను నాయక్‌, మేఘావత్‌ రాము నాయక్‌, గేమ్‌ నాయక్‌, ఎం బాలు నాయక్‌, మేఘావత్‌ లాలు నాయక్‌, షేక్‌ మహబూబ్‌ బాషా, చింతల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️