అంతర్జాతీయ క్రీడాకారునికి 50,000 ఆర్థిక సాయం

May 21,2024 14:44 #Bapatla District

ప్రజాశక్తి-వేటపాలెం(బాపట్ల) : పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడైన పిచ్చుక నాగరాజు అంతర్జాతీయ పారా ఒలంపిక్స్‌ వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 28 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు జరిగే పోటీలు చైనాలో జరగనున్నాయి. ఆర్థిక సహాయం లేక ఇబ్బందులు పడుతున్న నాగరాజుకు వేటపాలెం రోటరీ క్లబ్‌ రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేసినట్లు క్లబ్‌ అధ్యక్షుడు బట్ట మోహన్‌ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభిన్న ప్రతి బావంతుడైన నాగరాజు 2007, 2011లో జర్మనీ కంబోడియాలో జరిగిన పోటీల్లో పాల్గొని మన దేశానికి పతకాలు సాధించాడని తెలిపారు. ఎన్నారైలు పేరిసెట్ల లలిత బాబు, బొడ్డు వీరమల్లు, క్రీడాభిమానులు కట్ట రాజు వినరు కుమార్‌, సిద్ధిబుచ్చేశ్వరరావు, వడగ ప్రసాద్‌, యజ్ఞ నాగేంద్రప్రసాద్‌, పింజల శ్రీనివాసరావు, రొటేరియన్లు గొల్లపూడి సీతారాం, కొత్త వాసు, నాగేంద్రరావు, ఉపేంద్ర వాసు దేవ సింగ్‌ తదితరులు సహాయం అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఏఈ ఎయిరాసు గణపతి, రోటరీ కార్యదర్శి ఏవి సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️