ప్రజాశక్తి – గణపవరం : గణపవరం డిగ్రీ కాలేజీ లో మంగళవారం 54 వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలేజీలో మొదటి రెండవ సంత్సరం మూడవ సంవత్సరం చదివి పాసై బయటకు వెళ్ళుతున్నసందర్బంలో వారికి వీడ్కోలు వేడుకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ ప్రిన్సిపల్ పి నిర్మలా కుమారి మాట్లాడుతూ.. 2024 25 లో విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించారు. మీముందు ఉజ్వల బవిష్యత్ ఉందని దానీని సాకారం చేసుకొని జీవితంలో అబివృద్ది చెందాలని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా జీవీంచాలని అన్నారు. ఈకార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పిమదురాజు లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవంలో క్రిడా పోటీలలో గెలుపోందిన వారికి సర్టిఫికెట్లు బహుమతులు అందచేశారు.
