593 కిలోల విత్తనాలు సీజ్‌

Apr 3,2024 23:31

విత్తన దుకాణాలలో తనిఖీలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రూ.1.74 లక్షల విలువైన 593 కిలోల విత్తనాలను సీజ్‌ చేశారు. బుధవారం పలు విత్తన దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మస్తానమ్మ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ రానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలను, అధిక ధరలను అరికట్టేందుకు ప్రత్యేకంగా తనికీలు చేస్తున్నామన్నారు. విత్తన అమ్మకపు అనుమతి పత్రాలు లేని కొన్ని కంపెనీల విత్తన అమ్మకాలను నిలిపేశామన్నారు. నిషేధిత గ్లైసిల్‌, బిటి పత్తి విత్తనాలు అమ్మితే దుకాణం లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దుకాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. తనిఖీలలో మండల వ్యవసాయ శాఖాధికారి వి.నరేంద్రబాబు, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు.

➡️