ప్రజాశక్తి-ఈపూరు : నకిలీ పురుగుమందులు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని మండల వ్యవసాయాధికారి ఆర్.రామారావు హెచ్చరించారు. మండలంలోని ఇనిమెళ్లలో ఎరువులు, పురుగుమందు షాపులను రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన బుధవారం తనిఖీలు చేశారు. రామకృష్ణ ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్ట్ సైడ్స్ షాపులో పీసీలు లేని కారణంగా రూ.53,821 విలువచేసే పురుగుమందుల అమ్మకాలను నిలుపుదల చేశారు. మణికంఠ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులో పీసీలు లేకపోవడంతో రూ.6,950 విలువగల పురుగుమందుల అమ్మకాలను నిలిపేశారు. జి2, జి3 అనుమతులు కలిగిన బయో ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.