ప్రజాశక్తి-ముండ్లమూరు: రేషన్ షాపు నుంచి అక్రమంగా తర లిస్తున్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘ టన ముండ్లమూరులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముండ్లమూరు రేష న్ షాపు నుంచి 70 బస్తాల రేషన్ బి య్యాన్ని ఆటోలో లోడ్ చేసి వినుకొండ తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ముండ్లమూరు పోలీసులు మండలంలోని తమ్మలూరు గ్రామం వద్ద బి య్యం ఆటోను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రాధాకృష్ణకు అప్పగించారు. పేదలకు పంచకుండా అక్రమంగా తరలింపు..మండలంలో ప్రతినెలా పేదల బియ్యం అక్రమంగా రైస్ మిల్లులకు తరలుతున్నాయని, డీలర్లు పేదలకు పంచాల్సిన బియ్యాన్ని పంచకుండా కేజీ రూ.10 చొప్పున నగదు చెల్లించి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కంప్యూటర్ కాటాలో కాటా వేయకుండా తక్కెడ కాటాలో వేసి 10 కేజీ లకు బియ్యానికి మూడు కేజీలు తగ్గించి కొలతలలో తేడా చేసి ఇస్తున్నట్లు కార్డుదారులు వాపో తున్నారు. అడిగే వారే లేరని ఏమిటి అని అడిగితే ఇన్‌ఛార్జి మా బంధువని, నన్ను ఏమీ చే యలేరని చెబుతున్నారు. అధికా రులకు తెలియజేసినా 6ఏ కేసు నమోదు చేసి తూతూ మంత్రంగా చేతులు దులిపేసుకుం టున్నారు. మండలంలో 31 రేషన్ షాపు షాపులు ఉండగా 29 రేషన్ షాపుల్లో ఆటోల ద్వారా బియ్యం ఇస్తున్నారు. ముండ్లమూరు పెదరాయుడు పాడు గ్రామాలలో మాత్రం డీలర్ల వద్దకే వెళ్లి బియ్యం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదేమని ప్రశ్నిస్తే దర్శి ఇంచార్జి మా బంధువేనని, ఎవరు ఏమీ చేయలేరని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముండ్లమూరు, పెద రావిపాడు గ్రామాలలో ఆటోల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని, కార్డుదారులు కోరుతున్నారు.
