జిల్లాలోని గ్రామీణ రహదారులకు మహర్ధశ పట్టనుంది. ఈమేరకు జిల్లా లోని కడప అసెంబ్లీ మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల పరిధిలో రూ.71.15 కోట్లతో సిసిరోడ్లు, డ్రెయినేజీలు, బి.టిరోడ్లు, డబ్ల్యుబిఎం రహదారి నిర్మాణాలకు ఆమోదం లభించింది. ఈమేరకు టెండర్లు నిర్వహణపై దృష్టి సారించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకుని పనులు చేపట్టే దిశగా పంచాయ తీరాజ్ డిపార్టుమెంట్ ముందుకు సాగుతోంది. 2025 మార్చి నాటికి గ్రామ సీమ ల్లో మౌలిక వసతులను అభివృద్ధి పరచాలనే ప్రభుత్వ ఆశయాన్ని పరుగులు తీయిం చే దిశగా కదులతోంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలోని గ్రామీణ రహదారులకు కొత్తకళ రానుంది. ఇటీవల జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం రూ.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను అందజేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలను పరిశీలన అనంతరం మార్పు చేర్పుల అనంతరం రూ.71.15 కోట్లతో కూడిన పనులకు ఆమోదం తెలిపింది. ఈమేరకు జిల్లాలోని కడప అసెంబ్లీ మినహా మిగిలిన కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 976 పనులకు ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సిసిరోడ్లు, బి.టిరోడ్లు, డబ్య్లుబిఎం రోడ్లు, డ్రెయినేజీలు, పాఠశాలలకు కాంపౌండ్‌వాల్స్ వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున చేపడుతోంది. ఇందులో జిల్లా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల సాయం ంతో 56.72 కోట్లతో 12.65 కి.మీ మేర సిసిరోడ్లు, రూ.7.91 కోట్లతో 141 కి.మీ 10 బిటీ రోడ్లు, రూ.3.62 కోట్లతో240 కి.మీ డబ్యుబిఎం రోడ్లు, రూ.2.85 కోట్లతో 43 పాఠశాలలకు 28.25 కి.మీ మేర కాంపౌండ్‌వాల్స్ నిర్మాణ పనులు చేపట్టనుంది.కేటాయింపులు ఇలా.. జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా కమలాపురం అసెంబ్లీ పరిధిలో రూ.14.92 కోట్లతో 265 పనులను చేపట్టనుంది. చెన్నూరు మండల పరిధిలోని గ్రామసీమల్లో రూ.2.22 కోట్లతో 23 పనులను 55.64 కి.మీ చేపట్టనుంది. చింతకొమ్మదిన్నె మండల పరిధిలో రూ.2.35 కోట్లతో 45 పనులను 58.92 కి.మీ నిర్మించనుంది. కమలాపురం మండల పరిధిలో రూ.2.85 కోట్లతో 46 పనులను 71.37 కి.మీ చేపట్టనుంది. పెండ్లిమర్రి మండల పరిధిలోని రూ.2.71 కోట్లతో 60 పనులను 67.81 కి.మీ చేపట్టనుంది. వల్లూరు మండల పరిధిలో రూ.2.13 కోట్లతో 42 పనులను 53.37 కి.మీ నిర్మించనుంది. వీరపునాయునిపల్లి మండల పరిధిలో రూ.2.63 కోట్లతో 49 పనులను 65.88 కి.మీ చేపట్టనుంది. మైదుకూరు అసెంబ్లీ పరిధిలోని చాపాడు, మైదుకూరు, దువ్వూ రు, బి.మఠం, ఖాజీపేట మండలాల్లో రూ.182 పనులను రూ.8.47 కోట్లతో 182 పనులను 21.190 కి.మీ చేపట్టనుంది. బద్వేల్ అసెంబ్లీ పరిధిలోని అట్లూరు, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన మండ లాల పరిధిలో రూ.13.34 కోట్లతో 207 పనులను 266 కి.మీ మేర నిర్మించనున్నారు. పులివెందుల అసెంబ్లీ పరిధిలోని పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, లింగతాల, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాలకు రూ.47 కోట్లతో 85 పనులను 107 కి.మీ మేర చేపట్టనుంది. జమ్మలమడుగు అసెంబ్లీ పరిధిలోని జమ్మలమడుగు, కొండాపురం, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, యర్రగు ంట్ల మండలాలకు రూ.8.22 కోట్లతో 90 పనులను 16.454 కి.మీ నిర్మించ నుంది. ప్రొద్దుటూరు అసెంబ్లీ పరిధిలోని ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలా లకు రూ.7కోట్లతో 70 పనులను 14.108 కి.మీ మేరకు రహదారులు, పాఠశాల ల కాంపౌండ్ వాల్స్ చేపట్టడానికి కసరత్తు చేస్తోంది.2025 డిసెంబర్ నాటికి పూర్తి ! జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంగా టెండర్లు నిర్వహించడంలో నిమగమైంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న అనంతరం పనులకు శ్రీకారం చుట్టనుంది. 2025 డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించింది.
