76 పొక్లెయినర్లతో కంప తొలగింపు

Jun 9,2024 00:08

ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సిఆర్‌డిఎ కమిషనర్‌
ప్రజాశక్తి – తుళ్లూరు :
రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎపి సిఆర్‌డిఎ, అమరావతి స్మార్ట్‌ సిటీ పనులను అధికారులతో కలిసి సిఆర్‌డిఎ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ శనివారం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోడీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. శిలాఫలకం పరిసరాల్లో పిచ్చి మొక్కలు, కంప తొలగింపు, మ్యూజియంలో రాజధాని నమూనాల భద్రతపై అధికారులతో చర్చించారు. అమరావతిలో ట్రంక్‌ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇందుకు 76 జేసీబీలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేస్తున్న పనులను ఇంజినీ రింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనులను పరిశీలించి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసారు. తదుపరి ఉద్దండరాయునిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి నిరంతరాయంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇక్కడ సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పించాలని ఆదేశించారు.

➡️