16న రామకుప్పంలో సిఎం పర్యటన

Feb 10,2024 22:04

16న రామకుప్పంలో సిఎం పర్యటన
ప్రజాశక్తి – రామకుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈనెల 16న రామకుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎంపి, కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. మండల పరిధిలోని అంబేద్కర్‌ గురుకుల పాఠశాల సమీపంలో వైయస్సార్‌ చేయూత ఐదో విడతను సీఎం బటన్‌ నొక్కి మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నారు. అలాగే గత కుప్పం పర్యటనలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి హంద్రీనీవా కాల్వ ద్వారా కష్ణా జలాలు తీసుకొస్తామని కుప్పం ప్రజలకు మాట ఇచ్చారు. పుంగనూరు, బైరెడ్లపల్లి, వికోట మండలాల మీదుగా రామకుప్పంకు నీరు చేరుకుంది. శనివారం కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌, ఎస్పి జాషువా, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌, రెస్కో చైర్మన్‌ సెంథిల్‌, జిల్లా అధికార యంత్రాంగం వర్దికుప్పం వద్ద హంద్రీనీవా కాలువ జలాలను పరిశీలించారు. అనంతరం సభ ప్రాంగణాన్ని, వాహనాల పార్కింగ్‌, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జెడ్పిటిసి నితిన్‌ రెడ్డి, తహసిల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో రాధాకష్ణ, వైసిపి మండల కన్వీనర్‌ బాబు రెడ్డి, కోకన్వీనర్‌ చంద్రారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️