ప్రజాశక్తి-త్రిపురాంతకంమండలంలోని వెల్లంపల్లి జాతీయ రహదారి 544డిపై ఆంజనేయస్వామి గుడి దగ్గరలో రోడ్డుపై బుధవారం తెల్ల వారు జామున వాహనంలో తరిలిస్తున్న 90 బస్తాల రేషన్ బి య్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ ఎర్రగుం ట్ల చిన్న రాయుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు త్రిపురాం తకంకు చెందిన ఇమ్మడిశెట్టి ప్రసాద్, గాయం తిరుపతిరెడ్డి, దర్శికి చెందిన ప్రకాష్‌లు అక్రమంగా సేకరించిన రేషన్ బి య్యం రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై కేసు న మోదు చేశారు. పట్టుబడిన బస్తాలను త్రిపురాంతకం ఎం ఎల్‌ఎస్ గోడౌన్‌లో అప్పగించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ సీఐ రాఘవరావు, ఎస్సై నాగేశ్వరరావు, డిటి రాధాకష్ణ, విజి లెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
