నీటి కుంటలో పడి బాలుడు మృతి

Jun 11,2024 17:02 #death, #Kurnool

ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) :నీటి కుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నేమకల్లు గ్రామపంచాయతీ లోని మజార గ్రామమైన సంగాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురువ మహానంది, గాయత్రి దంపతులకు ఐదు మంది సంతానం కాగా 3 ఆడ పిల్లలు, 2 మగ పిల్లలు మృతి చెందిన అఖిల్‌ నాలుగో సంతానం. మంగళవారం ఉదయం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నా కొడుకు మృతి చెందడంతో తల్లి తండ్రులు బంధువులు సోకసంద్రంలో మునిగిపోయారు.

➡️