ఐటీతో ఉజ్వల భవిష్యత్తు

Oct 5,2024 15:13 #Bright future, #it

ప్రజాశక్తి- కలకడ (కడప) : ఐటీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపాల్‌ మలం షావలి తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ … మండల కేంద్రమైన కలకడ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు ఐటీ రంగంలో ప్రావీణ్యం పొందడానికి 10 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రతిరోజు పాటు విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపామన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఒకేషనల్‌ కోఆర్డినేటర్‌ ప్రతాప్‌, ఒకేషనల్‌ ట్రైనర్‌ విష్ణువర్ధన్‌ పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

➡️