శ్మశాన స్థలం కేటాయించాలి

Nov 26,2024 21:55
ఫొటో : ఆర్‌డిఒతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ఫొటో : ఆర్‌డిఒతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

శ్మశాన స్థలం కేటాయించాలి

ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని గిరిజన కాలనీ ప్రజలకు శ్మశాన స్థలం కేటాయించాలని, గిరిజన కాలని ఆధార్‌ కార్డులు లేని పిల్లలకు కొత్త కార్డు తీయడానికి బర్త్‌ సర్టిఫికెట్‌లు మంజూరు చేయాలనీ కోరుతూ ఆత్మకూరు ఆర్‌డిఒకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌బాషా మాట్లాడుతూ గిరిజన కాలనీ ప్రజలకు శ్మశాన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలనీకి పక్కన ఉండే అటవీ ప్రాంతంలో ఖననం చేస్తున్నారని, అటవీ ప్రాంతం కావున అక్కడ ఖననం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనుక ఎక్కడైనా ప్రభుత్వం వారు శ్మశాన స్థలం కేటాయించాలని కోరుతున్నామన్నారు. అలాగే గిరిజన కాలనీలో ఉండే చాలామంది పిల్లలకు ఆధార్‌ కార్డులు లేవని దాని వల్ల స్కూల్స్‌కు, అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, ఆధార్‌ కార్డులు కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ అవసరం ఉందని, వారికి త్వరగా బర్త్‌ సర్టిఫికెట్‌లు మంజూరు చేయాలన్నారు. అలాగే గిరిజన కాలనీలో మంచి నీటి సరఫరా చేయాలని, అలాగే కరెంట్‌ కోసం ఐదు స్థంభాలు అవసరం ఉందని, స్థంబాలు వేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, గిరిజన కాలనీవాసులకు సిమెంట్‌ రోడ్డులు వేయాలన్నారు. సమస్యలపై స్పందించిన ఆమె త్వరలోనే గిరిజనుల సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి, సిపిఎం మండల కమిటి సభ్యులు ఉప్పలపాడు మస్తాన్‌, సిఐటియు మండల అధ్యక్షులు మీరా మొహిద్దీన్‌, రహంతుల్లా, గిరిజన కాలనీ సిపిఎం శాఖ కార్యదర్శి వెంకటేష్‌, పార్టీ సభ్యులు అంకయ్య, మస్తాన్‌, రవి, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️