అరటి గెలల ఉత్సవాల్లో కూలిన పందిరి

ప్రజాశక్తి -నౌపడ (శ్రీకాకుళం) : సంతబమ్మాలి మండలం చెట్ల తాండ్రలో శనివారం అరటి గెలలు ఉత్సవంలో గోడ కూలి అరటి గెలల పందిరి ఒకసారిగా కూలి పోయింది. భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ మూడు రోజులు పాటు అరటి గెలలు ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి, ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున యాత్రకు వచ్చి అరటి గెలలు కడుతుంటారు. దీంతో బరువు ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న గోడ విరిగి అరటి గెలలు కట్టిన పందిరి ఒకసారిగా పక్కకు ఒరిగింది. వేలాదిమందిగా వచ్చిన యాత్రికులు ఉండగానే ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు కూలిన పందిరిని తొలగిస్తున్నారు. సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు , కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ ఉత్సవాలకు హాజరు కావాల్సి ఉంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️